A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండేళ్లపాటు యూనియన్ వద్దన్న కెసిఆర్
Share |
December 12 2019, 8:40 am

తెలంగాణ ఆర్టిసి లో రెండేళ్లపాటు యూనియన్ ఊసు లేకుండా నడుపుదామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించారు. ఈ రెండేళ్లలో మార్పు రాకపోతే అప్పుడు యూనియన్ వ్యవస్థకు వెళదామని ఆయన సూచించారు. ఆర్టిసి కార్మికులతో ఆయన సమావేశం అయి వివిధ అంశాలు మాట్లాడారు.. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఇంక్రిమెంట్ యథావిథిగా ఇస్తాం.
ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత.
ప్రయాణికులు టికెట్‌ తీసుకోకపోతే.. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయకుండా.. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి.
ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.వంటిపలు నిర్ణయాలను కెసిఆర్ ప్రకటించారు.

tags : kcr, unions

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info