ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లను డీకొట్టి మహారాష్ట్రలో అధికారం సాదించామని శివసేన వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఎమ్.పి సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో ఒక కాలమ్ రాస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని కూటమిని మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం స్వాగతించిందని తెలిపారు. శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయాన్ని ఢీకొట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.తమ కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు కొనసాగుతుందని సంజయ్ రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చొరవతోనే కూటమి సాధ్యమయిందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.గతంలో ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలకు రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. tags : sivasena