తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ దయే కారణమని మంత్రి కన్నబాబు అన్నారు. టిడిపి వారు వేసిన పుస్తకంపై ఆయన ద్వజమెత్తారు. జగన్ విలువలకు కట్టుబడి పార్టీ పిరాయింపులను ప్రోత్సహించలేదని, అందువల్లే ఎమ్మెల్యేలు ఇంకా టిడిపిలో నే ఉన్నారని ఆయన అన్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే పార్టీకి రాజీనామా చేశారని, జగన్ తలచుకుంటే ఈపాటికి టిడిపి ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీని వీడేవారని ఆయన అన్నారు.అవినీతి సామ్రాట్ గా చంద్రబాబు పేరొందారని, జపాన్ కు చెందిన మాకీ సంస్థ చంద్రబాబు ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వంగా అబివర్ణిస్తూ ఏకంగా ప్రధాన మంత్రికి లేఖ రాసిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు నవ్వుకుంటున్నారని కూడా లేకుండా చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆయన అన్నారు. tags : kannababu