A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల వియ్యంకుడికి రివర్స్‌ పంచ్‌
Share |
May 27 2020, 3:53 pm

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు సంబందించి రివర్స్ టెండరింగ్ , గత ప్రభుత్వం ఎవరికి ఎలా పనులు కట్టబెట్టింది వివరిస్తూ మీడియాలో వచ్చిన కదనం ఇది.

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో మిగిలిన పనులకూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడానికి జలవనరుల శాఖ సిద్దం అవుతోంది. పనులు చేయడానికి మొండికేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని.. అప్పటికీ దారికి రాకపోతే ఆంధ్రప్రదేశ్‌ డీటెయిల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌లోని (ఏపీడీఎస్‌ఎస్‌) 61సీ నిబంధన కింద వేటు వేసి, ఆ పనులకు అయ్యే అదనపు వ్యయంలో 95 శాతం సొమ్మును సదరు కాంట్రాక్టర్‌ నుంచి జరిమానా కింద వసూలు చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది.


పోలవరం ఎడమ కాలువ పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎడమ కాలువను 213.49 కిలోమీటర్ల పొడవున తవ్వి లైనింగ్‌ చేయాలి. 4 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. 2005 నుంచి ఇప్పటివరకు కేవలం 69 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడానికి జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది.


- పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను పాత కాంట్రాక్టర్‌ నుంచి 60సీ నిబంధన కింద విడదీసి.. వాటి వ్యయాన్ని రూ.181.87 కోట్లకు పెంచేసి, 2016లో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు చెందిన పీఎస్కే–హెచ్‌ఈఎస్‌(జాయింట్‌ వెంచర్‌) సంస్థకు టీడీపీ ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో అప్పగించింది. ఇప్పటివరకూ రూ.119.23 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. రూ.62.64 కోట్ల పనులు మిగిలాయి. పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న జలవనరుల శాఖ.. ఆ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి సన్నద్ధమైంది.
- రూ.196.20 కోట్ల విలువైన ఆరో ప్యాకేజీ పనులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితునికి చెందిన మధుకాన్‌–సినో హైడ్రో సంస్థ 2005లో దక్కించుకుంది. 2018 నాటికి రూ.112.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. ఈ సంస్థకు ధరల సర్దుబాటు కింద రూ.11.45 కోట్లను అదనపు బిల్లుగా టీడీపీ సర్కార్‌ చెల్లించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పనుల్లో రూ.70.29 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద తొలగించి.. వాటి వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచి, రాజమండ్రి టీడీపీ నేతకు చెందిన బీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. మిగిలిన రూ.13.43 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.119.81 కోట్లకు పెంచేసి, మధుకాన్‌కు భారీగా లబ్ధి చేకూర్చారు. రివర్స్‌ టెండరింగ్‌కు సర్కార్‌ సిద్ధమవడంతో.. తమకు అప్పగిస్తే పాత ధరలకే పనులు చేస్తామని మధుకాన్‌ సంస్థ వినతి పత్రం ఇవ్వడం గమనార్హం.

tags : polavaram, reverse tender

Latest News
*తన ఎమ్మెల్యేలకే చంద్రబాబు కోట్లు ఆఫర్ ..
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*చంద్రబాబు ఉల్లంఘన కేసు-హైకోర్టు ప్రశ్న
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info