A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు,రాదాకృష్ణలు కలిసి కుట్రలు
Share |
May 27 2020, 1:31 pm

తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.మత కల్లోలాలు సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్‌ నుంచి వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు.



గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని మండిపడ్డారు. టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో దుష్ర్పచారం జరగకుండా ఉండేందుకు సైబర్‌క్రైమ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతామని వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాలకమండలిలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోకుండానే మీడియాలో చర్చలు పెడుతున్నారని వివరించారు. అసలు అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్‌సైట్లో లేదని, గూగుల్‌ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని ఆయన తెలిపారు.

tags : yv subbareddy

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info