A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హోం కార్యదర్శికి ‘కళా’ లేఖ
Share |
December 15 2019, 4:11 am

ఎపిలో అధికార పార్టీ ఆదేశాలతో పోలీస్‌ శాఖ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని భగ్నం చేస్తోందని ఆ పార్టీ ఎపి శాఖ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. టీడీపీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం, జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై అమరావతిలో జరిగిన దాడి... తదితర అంశాలను వివరిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. వరుస సంఘటనలను తన లేఖలో ప్రస్తావించిన కళా... వాటన్నింటిపైనా వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

tags : kala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info