A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహేశ్ బాబు స్పందన-కవిత ఎవరైతే..
Share |
December 15 2019, 2:00 am

‘రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఓ సమాజంగా మనం ఓడిపోయాం. ఇలాంటి దారుణ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలి. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అందరం కలిసి భారతదేశాన్ని ఆడవారికి సురక్షితంగా మార్చుదాం’అని ప్రముఖ నటుడు మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆయన ఈ సందర్భంగా పెట్టిన కవిత కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకు, ఆత్మకు విలువిస్తారో..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం మరిచిపోరో..
స్త్రీకి శక్తి ఉంది.. గుర్తింపు ఉంటుంది.. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తి అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్కమాటలో చెప్పాలంటే.. వాడే మగాడు..

tags : maheshbabu, reacton, kavita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info