A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి కార్మికులతో కలిసి కెసిఆర్ భోజనం
Share |
December 15 2019, 3:19 am

ఆర్టిసి సమ్మె సమయంలో కార్మికులపైన తీవ్ర ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు వారిపట్ల ఆదరణ చూపుతున్నారు. ఆయన ప్రగతి భవనల్ వివిధ డిపోల నుంచి వచ్చిన కార్మికులతో మాట్లాడారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు చొప్పున కార్మికులు వచ్చారు.ఈ సమావేశం తర్వాత కెసిఆర్ వారితో కలిసి మద్యాహ్న బోజనం చేశారు.కార్మికులకు ఆర్టిసి ఆర్దిక పరిస్థితి తెలియచేయడం ఈ భేటీ లక్ష్యంగా ఉంది.దానికి తోడు కార్మిక సంఘాల వారితో కాకుండా నేరుగా కార్మికులతోనే భేటీలు జరపాలని ఆయన భావించారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని సమావేశానికి హాజరైన వారు చెప్పారు.

tags : kcr, lunch

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info