ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల్లో మంచేసిన ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి నేత,మాజీ మంత్రి లోకేష్ అన్నారు.‘‘విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ ఆరునెలల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను సూసైడ్ ప్రదేశ్‌గా మార్చారు. ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లోనే మాట మార్చేసి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాశారు’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. వృద్ధులకు నెలకు రూ.250, రైతులకు నెలకు రూ.625 ఇస్తున్న జగన్... తమ వైసీపీ కార్యకర్తలకు మాత్రం గ్రామ వలంటీర్ల పేరుతో నెలకు రూ.8వేలు ఇస్తూ ఏటా రూ.4వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. tags : lokesh