ఉత్తరప్రదేశ్ లో మధ్యాహ్న బోజన పధకం పై గతంలో ఆసక్తికర ,ఆశ్చర్య కధనాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటిదే వచ్చింది.సోన్ భద్ర జిల్లాలో కోట అనే గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో మద్యాహ్న బోజన పధకం లో భాగంగా పాలు కూడా విద్యార్ధులకు పంపిణీ చేయాలి.ఒక్కో విద్యార్ధి 150 మిల్లీలీటర్ల పాలు ఇవ్వవలసి ఉంది.అయితే పాల సరఫరాదారు ఒక లీటర్ పాలు తెచ్చి ఉన్న విద్యార్ధులకు ఎలా ఇవ్వాలా అని ఆలోచించి తదనుగుణంగా నీళ్లు కలుపుతాడట.మొత్తం 81 మంది విద్యార్దులకు ఈ రకంగా నీళ్లపాలు ఇస్తున్నారట.ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవడంతో జిల్లా కలెక్టర్ అక్కడకు వెళ్లి టీచర్లను సస్పెండ్ చేశారు. tags : up, milk