A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిగ్ బాస్ కంటెంస్టెంట్ తో అసభ్య ప్రవర్తన-కేసు
Share |
December 15 2019, 3:25 am

తెలంగాణలో పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశీశ్ గౌడ్ ఒక మహిళతో అసభ్యంగా వ్యవహరించినట్లు కేసు నమోదు అయింది. నావోటెల్‌ హోటల్‌లో తమతో ఆశీష్‌ అసభ్యంగా వ్యవహరించాడని బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. బౌన్సర్ల సమక్షంలో తమను ఆశీష్‌ వేధిస్తున్నా హోటల్‌ యాజమాన్యం అడ్డుకోలేదని ఆమె తెలిపారు.ఈ ఘటన రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. మద్యం బాటిళ్లలో అశీశ్ దాడి చేశాడని , భయంతో తాము అక్కడ నుంచి తప్పించుకున్నామని పిర్యాదులో తెలిపారు.ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

tags : sanjana case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info