అమరావతి నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడని తాము మొదట్నుంచీ చెప్తున్నామని ఆయన అన్నారు. రాళ్లు, చెప్పులు వేయడం చంద్రబాబు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. బీజీపీ అధికార ప్రతినిధి సామంచి నివాస్ మాట్లాడుతూ.. తిరుపతిలో అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేస్తే, అధికారంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆయన పాలనలో బీజేపీ నేతలపై చాలా దాడులు జరిగినా ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు అమరావతిలో ప్రజలు ఆగ్రహంతో రాళ్లు విసిరితే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. tags : madhav