A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వం, అహ్మదాబాద్ ఐఐఎమ్ ఒప్పందం
Share |
December 12 2019, 8:08 am

ఎపిలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న అంశాలను అధ్యయనం చేసి, తగిన సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మక ఐఐఎం (అహ్మదాబాద్‌)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఐఐఎం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణ స్వామి, ఏసీబీ చీఫ్‌ విశ్వజీత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఈ సందర్భంగా పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాల కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. గతంలో ఏపని కావాలన్నా ప్రజలు మండల కార్యాలయానికి వెళ్లేవారని, అక్కడ సకాలంలో పనులు కాకపోవడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు.

tags : ap, agreement

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info