A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో-బుగ్గన
Share |
December 12 2019, 8:08 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాటలు ఎవరికి అర్దం కాకుండాఉన్నాయని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అమరావతి ప్రపంచ రాజధాని అయిపోయేదని చంద్రబాబు అంటున్నారని అదెలా సాద్యమని ఆయన ప్రశ్నించారు. లక్ష కోట్ల తో నగరాలు వచ్చేస్తే ప్రపంచం అంతా ఎన్ని నగరాలు వచ్చేవని ఆయన అన్నారు.హైదరాబాద్ నగరం400 ఏళ్లనాటిది అని, దానిని తానే కట్టానని చంద్రబాబు చెబుతుంటారని బుగ్గన ఎద్దేవ చేశారు. సింగపూర్ ప్రభ/త్వానికి, ఎపి ప్రభుత్వానికి సంబందం లేదని , కేవలం కొన్ని కంపెనీలు ,ఎపితో ఒప్పందం చేసుకున్నాయని ఆయన అన్నారు.వాటి ఒప్పందం అమలు చేయాలంటే లక్షల కోట్లు ఎపి డబ్బు వెచ్చించాలని అది ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ వారు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగానే ఉన్నాయని తెలిపాయని ఆయన అన్నారు.తాత్కాలిక భవనాలకు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చు చేశారని, హైదరాబాద్ లో భూమితో సహా ఆరువేల రూపాయల కు అపార్టెమెంట్ లభిస్తుంటే, అమరావతి ఉచిత భూమికి అడుగు కు పదివేల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. బంగారుగుడ్లు సంపాదించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

tags : buggana

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info