తాను ఏ చెడు చేయకపోయినా ప్రజలను మభ్యపెట్టే విదంగా దుష్ప్రచారం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.బిసిలు ముందడుగు వేయాలని ఆరాటపడుతున్నా..అది నేను చేసిన తప్పా..అని ఆయన అన్నారు. పత్రికాదిపతులు ఎవరైనా మీవద్దకు వచ్చినప్పుడు వారిని అడగండి..మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం.మాకు తెలుగు మీడియమా అని అడగండి అని ఆయన అన్నారు. ఎందరు శత్రువులు తయారైనా, ఎందరు అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా..ప్రజల అండ మాత్రం తనకు ఉంటే చాలు అని జగన్ అన్నారు. కొందరు కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. tags : jagan, media