ఈ ఆరు నెలల కాలంలోనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలన చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముమ్మడి వరంలో జరిగిన మత్స్యకార సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, వారంతా మీ కళ్ల ముందే కనిపిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే రైతులకు చెప్పినట్లు భరోసా కింద 13500 చొప్పున ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ కాలంలోనే ఆటోలు, టాక్సీలు నడుపుకునే వారికి ఆర్దికసాయం చేశాం. అగ్రిగోల్డ్ బాదితులకు అండగా నిలబడ్డాం.రాష్ట్రంలో కాని,దేశంలో కాని ఎక్కడ లేని విధంగా నామినేటెడ్ పోస్టులలో ఎస్.సి,ఎస్టి,బిసిలకు సగం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అలాగే మహిళలకు ఏభై శాతం పదవులు ఇవ్వడానికి కూడా చట్టం చేశామని అన్నారు. ఈ ఐదారు నెలల్లో ఇవన్ని చేయగలిగామని అన్నారు. ప్రబుత్వ తీరును అంతా చూస్తున్నారని, మీ అందరి దీవెనలతో ఇంకొ గొప్ప పాలన చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నానని జగన్ ప్రకటించారు. బడులలో నాడు-నేడు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.ఆస్పత్రులలో కూడా మార్పు తెస్తున్నామని ఆయన అన్నారు. ఇంగ్లీష్ విద్య పిల్లలకు అవసరమని, మన పిల్లలు కూడా టై కట్టుకని తిరగాలని ఆయన అన్నారు. tags : jagan, rule