A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి దొరికిన ఖరీదైన చేప
Share |
July 10 2020, 12:11 am

కర్నాటక లో జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీచేస్తున్న బిజెపి అభ్యర్ధి టిబి నాగరాజు అత్యంత ధనవంతులలో ఒకరైన నేతగా నమోదు అయ్యారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో 1120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు.తన పేరు మీదకాని, భార్య,పిల్లల పేరిట ఉన్న ఆస్తులను చూపించారు. ఆయన గత కుమారస్వామి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవికి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ఆయనపై కూడా అనర్హత వేటు వేశారు. సుప్రింకోర్టు అనుమతి ఇవ్వడంలో తిరిగి హోస్కోటి నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి మారి ఉప ఎన్నికలో పోటీపడుతున్నారు. అయితే ఒక ఏడాదిలోపే ఆయన ఆస్తి నికర విలువ 160 కోట్లు పెరిగినట్లు చూపారు. కాగా ఆయన బ్యాంక్ డిపాజిట్లు దాదాపు 48 కోట్లు గా ఉంది.బిజెపికి ఖరీదైన చేపే దొరికిందన్నమాట.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info