A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
Share |
July 9 2020, 10:22 pm

సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయి (శాచ్యరేషన్‌)లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అర్హులెవ్వరూ కూడా మిగిలిపోకుండా పథకాలు అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధంచేసింది. వివిధ పథకాల అర్హతలను సడలించడంతోపాటు డిసెంబర్‌ 20లోగా లబ్ధిదారుల జాబితాలను విడుదలచేస్తుంది. ఆవెంటనే బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రియంబర్స్‌ మెంట్‌ లబ్ధిదారులకు కొత్తగా కార్డుల జారీచేస్తోంది.

ప్రభుత్వ పాలనలో, వివిధ సంక్షేమ ఇతర పథకాల అమల్లో నిష్పాక్షికత, లంచగొండితనం, అవినీతి నిర్మూలన, పారదర్శకతకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఆదిశగా మరిన్ని అడుగులు వేస్తోంది. అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. ఈమేరకు గతంలో ఉన్న అర్హతలను కూడా సడలించింది. దీనికి సంబంధించి కొత్తగా బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్, ఫీజురియింబర్స్‌మెంట్‌ కార్డులు జారీచేయనుంది. నవంబర్‌ 20 నుంచి దీనికి సంబంధించి ప్రభుత్వ గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హులైనవారి జాబితాలను సోషల్‌ ఆడిట్‌కోసం ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తుంది. ఎవరైనా తమ పేరు జాబితాలో లేదని గుర్తిస్తే, వెంటనే మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తమ దరఖాస్తును ఎవరికి పంపాలన్న సమాచారాన్ని కూడా జాబితాల కింద ప్రభుత్వం పొందుపరుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లు చురుగ్గా పనిచేస్తారు. పేదల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని, మరింత మందికి మేలు చేసే ఉద్దేశంతోనే అర్హతలను సడలించి, గతంలో ఉన్న ఆదాయ, భూ పరిమితులను పెంచి జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీచేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. బియ్యంకార్డు, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెనల కింద ఈ కార్డులను లబ్ధిదారులకు ఇవ్వనుంది.

దీంతో పాటు వైయస్సార్‌ మత్స్యకార భరోసా, వైయస్సార్‌ నేతన్న నేస్తం, వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం, అమ్మ ఒడి, షాపులు పెట్టుకుని అందులో తమ వృత్తి చేసుకుంటున్న, టైలర్లు – రజకులు – నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం, వైయస్సార్‌ కాపు నేస్తం, అర్చకులకు, పాస్టర్లకు, ఇమామ్‌లకు, మౌజంలకు ఆర్థిక సహాయం పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ, వాటికి ఆమోదం, జాబితాల రూపకల్పన తదితర అంశాలకు సంబంధించి గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లకు కచ్చితమైన మార్గదర్శకాలను పంపడంతోపాటు, ఈ అంశాల్లో వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారులు క్యాలెండర్‌ కూడా తయారుచేశారు.

*అర్హత నిబంధనల సడలింపు:*

*బియ్యంకార్డు*

1.
గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. తాజాగా ప్రభుత్వం దీన్ని సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు. గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది.

2.
2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులని ప్రకటిస్తే.. ఈ పరిమితులను కూడా సడలించింది. 3 ఎకరాల మాగాణి లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో పేర్కొంది.

3.
గతంలో రేషన్‌ పొందాలంటే నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉంటేనే అర్హులు. కాని దీన్ని సడలిస్తూ నెలకు సరాసరి సగటు 300 యూనిట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

4.
ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులని గతంలో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ పెన్షన్‌ తీసుకుంటున్నవారు అనర్హులని నిబంధనల్లో పొందుపరిచారు. అయితే పారిశుద్ధ్యకార్మికులుగా పనిచేసివారికి ఈసారి నిబంధనలనుంచి మినహాయింపు ఇచ్చారు.

5.
గతంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీలు నడుపుకుంటున్నవారికి మినహాయింపు. ఈసారి ట్యాక్సీలే కాకుండా ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకుంటున్న వారికీ మినహాయింపును ఇచ్చారు.

6.
ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు, అర్బన్‌ ప్రాంతాల్లో 750
స్క్వేర్‌ఫీట్‌లోపు స్థిరాస్తి ఉన్నవారిని అనర్హులు అన్న నిబంధనలను యథాతథంగా ఉంచారు.

*వైయస్సార్‌ పెన్షన్‌ కానుకకు* సంబంధించి కూడా కీలక నిబంధనను సడలించారు. దీనికోసం ఉద్దేశించిన భూ పరిమితులను సడలించారు.
గతంలో మాగాణి 2.5 ఎకరాలు, మెట్టు 5 ఎకరాలు లేదా రెండూ కలిపితే 5 ఎకరాల్లోపు ఉన్నవారే అర్హులని ప్రకటించగా 5 ఎకరాల మాగాణి లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ, లేదా రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారికి వర్తింస్తుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. దీంతోపాటు బియ్యంకార్డుకోసం సడలించిన అర్హతలనూ వైయస్సార్‌ పెన్షన్‌ కానుకకూ వర్తింపుచేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.

*వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ:*

వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ విషయంలో ప్రభుత్వం తాజాగా ఉన్న నియమ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇచ్చింది. తెల్లరేషన్‌కార్డు ఉన్నవాళ్లకి ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని గత ప్రభుత్వం నిబంధనలు చెప్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.60వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.70వేలు, 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు, నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్నవారు తెల్లకార్డుకు అర్హులని నిబంధనల్లో పేర్కొంది.

1.
తాజా నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.

2.
12 ఎకరాల పల్లం, 35 ఎకరాల మెట్ట లేదా రెండూ కలిపి 35 ఎకరాలు ఉన్నవారు ఆరోగ్యశ్రీకి అర్హులేనని జీవో కూడా జారీచేసింది.

3.
అలాగే కుటుంబంలో స్థిరాస్తి లేకుండా ఒక కారు ఉన్నవారికీ లేదా పట్టణ ప్రాంతాల్లో 3వేల స్క్వేర్‌ఫీట్‌ స్థిరాస్తి ఉన్నవారికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా లబ్ధిపొందుతారని స్పష్టంచేసింది.

*జగనన్న విద్యాదీవెన(పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌) మరియు జగనన్న విద్యా వసతి ( హాస్టల్, వసతి ఖర్చలకు ఏడాదికి రూ.20వేలు) :*

విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేయనుంది. అంతేకాదు హాస్టల్‌ వసతి ఖర్చుల కింద ఏటా రూ.20వేల రూపాయలను జగనన్న విద్యా వసతికింద ఇవ్వనుంది. గతంలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.

ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాదాయం పరిమితి రూ.2 లక్షలు, బీసీలకు లక్ష రూపాయలలోపు ఉన్నవారికి ఫీజురియంబర్స్‌ మెంట్‌ వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు. మైనార్టీలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్నవారికి వర్తిస్తుందని గత నిబంధనలు పేర్కొంటున్నాయి. కాపులకు రూ.1 లక్ష , ఈబీసీలకే రూ.1లక్ష, దివ్యాంగులకు రూ.2లక్షల లోపు ఉన్నవారికి వర్తిస్తుందని గత నిబంధనలు చెప్తున్నాయి.

తాజాగా ప్రభుత్వం రూ.2.5లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ (ఫీజురీయింబర్స్‌మెంట్‌) జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది.

10 ఎకరాలలోపు మాగాణి గాని లేదా, 25 ఎకరాల్లోపు మెట్ట ఉన్న వారికీ, లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందంటూ నిబంధనలు సడలించింది.
పారిశుధ్ద్యకార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.
కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ఉన్నవారు అర్హులేనని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఆదాయపుపన్ను కట్టేవారిని అనర్హులుగా స్పష్టంచేస్తోంది.
పట్టణాల్లో 1500 స్క్వేర్‌ ఫీట్‌ స్థిరాస్థి ఉన్నవారికీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో స్పష్టంచేసింది.
పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

tags : ap, schmes

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info