ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఆంగ్ల మాద్యమం విదానాన్ని గట్టిగా సమర్దించారు.ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నవారే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారని, తెలుగుమీడియంలో చదువుకుంటున్న పేదవర్గాల పిల్లలు సెక్యూరిటీ గార్డు, పోలీసు కానిస్టేబుల్ వంటి చిన్పపాటి ఉద్యోగాలకే పరిమితమవుతున్నట్టు ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుదురులో వెలమ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమాన అవకాశం కల్పించినప్పుడే పేదల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధన తీసుకువస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే నా సపోర్టు అని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులవారు ఇంగ్లిషు చదువులు చదవలేక వెనుకబడిపోతున్నారన్నారు. అదే అంశాన్ని తానుతీసిన ఎర్రసైన్యం సినిమాలో చూపించానని ఆయన అన్నారు. tags : r narayanamurthy