హైదరాబాద్ లో ప్రజలు పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వంటి వారి సంగతేమో కాని,ఆయా మీడియా రిపోర్టర్లు లేదా కంట్రిబ్యూరర్ల బెడదను ఎదుర్కుంటున్నారట.ఆయా పత్రికలకు,టీవీలకు ప్రతినిదులుగా చెప్పుకుంటున్నవారు కాని, లేదా నిజంగా పనిచేస్తున్నవారు కాని కొందరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కుమ్మక్కై డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారట. అలాంటివారు వంద మంది రిపార్టర్ల వరకు ఉండచవ్చని ఎసిబి వర్గాలు చెబుతున్నాయి.రెండు రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అదికారితో పాటు ఇద్దరు రిపోర్టర్ల ను కూడా ఎసిబి అరెస్టు చేసింది. ఆ విషయం తెలిసిన పలువురు తమకు కూడా బెదిరింపులు వస్తున్నాయంటూ వాట్పప్ ద్వారా పిర్యాదులు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల వారి వద్దకు వెళ్లి పోటోలు తీయడం,నిబందనలు ఉల్లంఘించడం వంటివి జరుగుతున్నాయంటూ ఆరోపించి భయపెట్టడం,డబ్బులు గుంజడం చేస్తున్నారు. దిండిగల్ వద్ద ఒక నకిలీ రిపోర్టర్ ఏభై వేల రూపాయలు డిమాండ్ చేశారని పోలీసులు గుర్తించారు. మొత్తం మీద ప్రజలు అవినీతి అదికారులనే కాదు..ఈ మీడియా రిపోర్టర్ ల బెడదను కూడా ఎదుర్కోవలసి వస్తోంది. tags : hyderabad,coruption