ఆర్దిక మాంద్యం ప్రభావం కేంద్ర ప్రబుత్వంపై తీవ్రంగా పడిందన్న వార్త వచ్చింది. ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల మేర బడ్జెట్ లో కోత పెట్టవచ్చని అంచనాలు వేస్తున్నారు.ఈ ఏడాది 13.5 లక్షల రూపాయల మేర ఆదాయం సమకూరవచ్ని అనుకున్నారు. కాని అందులో రెండు లక్షల కోట్లు తగ్గవచ్చని,అందులో లక్షకోట్ల నుంచి లక్షా ఇరవై వేల కోట్ల వరకు కార్పొరేట్ పన్నులోను, మరో ఏభై ,అరవై వేల కోట్ల రూపాయలు జిఎస్టిలోను తగ్గవచ్చని చెబతున్నారు.దాంతో ఆయా శాఖలకు పొదుపు ఆదేశాలు వెళ్లాయి. అనవసర వ్యయాన్ని తగ్గించాలని సూచించారు.అయితే సంక్షేమ పదకాలలో కోత పెట్టబోమని మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారు. tags : center budget