A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు
Share |
November 22 2019, 12:05 am

దేశంలో ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని సిపిఎం పాలిట్ బ్యూరో సబ్యురాలు బృందా కారత్ విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు.
బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయి. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నా. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంత మంది స్వామీజీలు కూడా ఉన్నారని ఆమె ద్వజమెత్తారు.

tags : brinda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info