A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తొలి దశలో ఆరో తరగతివరకే ఆంగ్ల మీడియం
Share |
July 10 2020, 12:00 am

ఎపిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేనందున ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టడంలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తాజాగా తొలిదశలో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 14 నుంచి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించారు.

tags : english medium

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info