A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్-డొక్కా సీతమ్మ- శిబిరాలు
Share |
May 25 2020, 8:29 pm

పనులు లేక పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా
సీతమ్మగారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ ఆహార
శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో (శుక్రవారం,
శనివారం) జనసేన నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల కోసం
డొక్కా సీతమ్మ శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శిబిరాల
ఏర్పాటుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.ఆకలితో ఉన్న
వారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే...భవన నిర్మాణ
కార్మికుల ఉపాధి పోగొట్టి వారి కడుపు మాడ్చేసింది. విశాఖలో వారికి
మద్దతుగా చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతంగా సాగింది. విశాఖ ప్రెస్
మీట్ లో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులకు అండగా శిబిరాలు
ఏర్పాటు చేస్తాం అని చెప్పాం. అందులో భాగంగా జనసేన నాయకులు,
జనసైనికులు వారికి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పస్తులుంటున్న
కార్మికుల కోసం మనకి చేతనైన సహాయం. మనకి పరిమితమైన వనరులే ఉన్నాయి.
మనం ఎంత సహాయం చేయగలిగితే అంత చేద్దాం.
శిబిరాలు ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం మాది ఒక పార్టీ
అయినప్పటికీ, 35 లక్షల మందికి పైగా జీవితాల్ని పోషించలేనప్పటికి భవన
నిర్మాణ కార్మికులకు మేమున్నాం అన్న భరోసా కల్పించడం, ప్రభుత్వానికి
కళ్లు తెరిపించడం. జనసేన శ్రేణులు, నాయకులు మనవంతు సాయంగా కొంత కృషి
చేసి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దాం.అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
.............
పవన్ కళ్యాణ్ కు ఇసుక రాజకీయమే పెద్ద రాజకీయంగా భావిస్తున్టన్లుగా ఉంది. ఇప్పటికే ఇసుక బాగానే అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.అయినా పవన్ కళ్యాణ్ దీనిపై శిబిరాలు అంటున్నారు.అయితే ఆయన పార్టీ కార్యకర్తలకు ఈ పిలుపు ఇచ్చారు..మరి వారు ఎన్ని లక్షల మందికి శిబిరం ఏర్పాటు చేస్తారో చూడాలి.

tags : pawankalyan

Latest News
*తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఎపిలో వ్యవసాయ సలహా మండళ్ల జిఓ
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info