A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రిగోల్డ్ - మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బాధ
Share |
November 22 2019, 3:49 am

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేసే క్రమంలో తెలుగుదేశంప్రభుత్వ హయాంలోనే ఏజెంట్లకు, డిపాజిటర్లకు నిధులివ్వడానికి అన్నీసిద్ధంచేసి, వంటంతా తయారుచేస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేవలం వడ్డనతో సరిపెట్టి, అంతాతానే చేసినట్లు చెప్పుకుంటు న్నాడని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అగ్రిగోల్ట్‌ సమస్యను గుర్తించి, కోర్టుపర్యవేక్షణలో బాధితులకు న్యాయంచేయడానికి ఆ సంస్థ ఆస్తులను వేలంవేసి, తద్వారా వచ్చినమొత్తాన్ని కోర్టుకు జమచేసింది తెలుగుదేశం ప్రభుత్వమైతే, అంతాతామే చేసినట్లు వైసీపీనేతలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. న్యాయ స్థానం ఆదేశాలప్రకారం పంపిణీచేయడానికి బడ్జెట్లోనిధులు కేటాయించిన తెలుగుదేశం ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గపుప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ప్రైవేట్‌సంస్థ ప్రజలను మోసగిస్తే, బాధితులపోరాటాన్ని గమనించి, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదన్న సదుద్దేశంతో నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసువిచారణను సీబీసీఐడికి అప్పగించారని ఆనందబాబు తెలిపారు. కేసువిచారణ త్వరితగతిన జరిగేలా చూడటమేగాక, సంస్థ ముసుగులో ప్రజల్ని మోసంచేసినవారిని జైళ్లకుకూడా పంపడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని సీజ్‌చేసి, కోర్టుపర్యవేక్షణలో ఉంచిన తెలుగుదేశం ప్రభుత్వంపై బురదజల్లాలని చూడటం ప్రభుత్వాధినేతకు తగదన్నారు. న్యాయస్థానంలో కేసువిచారణ జరుగుతున్నందున అగ్రిగోల్డ్‌ బాధితులకు నిధులుచెల్లింపులో జాప్యం జరిగిం దని నక్కా చెప్పారు. ఎన్నికలకు ముందు బాధితులకు న్యాయంచేయడానికి రూ.10వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులుచేయడానికి రూ.250కోట్లను కోర్టుకి అందచేయడం కోసం నిధులు కూడా విడుదలచేశామన్నారు. వాటితోపాటు అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులవేలం ద్వారా వచ్చిన మరికొంత మొత్తాన్ని కూడా కలిపి, మొత్తం రూ.363కోట్లు బాధితులకు ఇవ్వడానికి సిద్ధంచేశామన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీప్రభుత్వం విడుదలచేసిన రూ.363కోట్లలో రూ.250కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకిచ్చి, అంతాతానే చేసినట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. టీడీపీప్రభుత్వం విడుదలచేసిన నిధులన్నీ బాధితులకు ఇవ్వకుండా కొంతకాజేసిన ప్రభుత్వం టీడీపీపై ఆరోపణలు చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తెలుగుదేశం ప్రభుత్వం సంరక్షించిందని, ఆత్మహత్యచేసుకున్న 100 మందికి పైగా డిపాజిటర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిం దన్నారు.

టిడిపి నేతల బాద చెప్పనలవి కానిది అనుకోవాలి!

tags : nakka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info