A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెల్లవారుజామునే గృహనిర్భంధం
Share |
November 22 2019, 3:53 am

మిలియన్ మార్చ్ తరహాలో టాంక్ బండ్ పై నిరసన చేపట్టాలని ఆర్టిసి కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు సంకల్పించిన నేపద్యంలో పలువురు నేతలను గృహ నిర్భందం చేశారు. దీనిపై మాజీ ఎమ్.పి,కాంగ్రెస్ నేత పొన్నం ప్రబాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తమ ఇంటి తలుపులు కొట్టి హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పి ఇంటి ముందు పోలీసులను కూర్చోబెట్టారని , ఇది దారుణంగా ఉందని ఆయన విమర్శించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అణచివేతను ఎదుర్కొనలేదని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజరిక పాలన చేస్తుండడంతో ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కోల్పోయామని ఆయన అన్నారు.

tags : telangana, house arrest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info