A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామజన్మభూమిపై తీర్పు- ప్రదాని వ్యాఖ్య
Share |
November 22 2019, 2:43 am

అయోద్య రామ జన్మభూమి వివాదంపై ప్రదాని నరేంద్ర మోడీ స్పందించారు. సుప్రింకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. దీనిపై ఆయన వరస ట్వీట్ లు చేశారు.
అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు.. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని మరోసారి నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా విని... తగు సమయం తీసుకున్న తర్వాతే చరిత్రాత్మక తీర్పు వెలువడిందన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో 130 కోట్ల మంది భారతీయులు సంయమనం పాటించి.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని విఙ్ఞప్తి చేశారు.
ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో.. ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

tags : modi, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info