A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు..కార్యకర్తలు..ఇద్దరూ మారడం కష్టమే
Share |
February 22 2020, 7:06 pm

తెలుగుదేశంలో తరచు వినిపించే మాట చంద్రబాబు మారాలి. దానికి ఆయన ఇచ్చే సమాదానం కూడా ఒకటే .. నేను మారతాను..మీరు మారాలి.. అని ..ఈ రెండు ఈనాటివి కావు. గత ఇరవై ఏళ్లలో ఎన్నోసార్లు టిడిపి నేతలకు, ,కార్యకర్తలకు , చంద్రబాబు కు మద్య జరిగే సంభాషణే. ఈ మారడాలు ఏమిటో ఇంతకాలలంగా పరిశీలన చేస్తున్నవారెవ్వకరికి అంతు పట్టదు.నిజంగానే చంద్రబాబు ఎందుకు మారాలి? ఎలా మారాలి. ఎక్కడ మారాలి? అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎవరూ దైర్యంగా ఎందుకు ఈ మాట చెప్పలేకపోయేవారు? అదికారం పోయినప్పుడల్లా ఎందుకు ఈ చర్చ జరుపుతుంటారు? కార్యకర్తలు తమ కాంపౌండ్ దాటి పోకుండా ఉండడం కోసం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.అందులో ఒకటి నియోజకవర్గాల వారీగా సమీక్ష కార్యక్రమం. సాదారణంగా అక్కడకు వచ్చినవారు మళ్లీ పార్టీ మారడానికి మొహమాట పడవచ్చు. అందుకోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సమావేశాలు పెడుతుంటారు. గత ఐదు నెలల్లో ఇప్పటికి రెండుసార్లు ఇలాంటి సమావేశాలు పెట్టి,ఇప్పుడు మరో సారి అలాంటి సమావేశాలు జరపుతున్నట్లుగా ఉంది.సాదారణంగా జిల్లా స్థాయిలో జరిగే పార్టీ సమావేశాలకు రాష్ట్ర అద్యక్షులు లేదా ఇప్పుడు జాతీయ పార్టీ అద్యక్షుడుగా చెప్పే చంద్రబాబు వెళ్లవలసిన అవసరలేదు.కాని చంద్రబాబు ఏదో ఒక పని పెట్టుకోవాలి కాబట్టి ఇలా జిల్లా సమావేశాలు అని సభలు పెట్టి ఉపన్యాసాలు దంచుతుంటారు.మీడియాలో వార్తల కవరేజీ లక్ష్యంగా ఆయన మాట్లాడుతుంటారు.ఇందులో లో పెద్ద తప్పు ఉందని కూడా ఎవరూ అనజాలం. అయితే ఆ తర్వాత నియోజకవర్గాల వారీ మీటింగ్ లలో పలువురు కార్యకర్తలు చంద్రబాబు మారాలని అన్నారట. అంటే ఏమిటంటే కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాలని అన్నారట. దానర్దం ఆయన ఇంతవరకు కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వలేదని చెప్పడమా. పార్టీని పట్టించుకోలేదని అనడమా? ఆ మాట కు వస్తే పార్టీకి,ప్రభుత్వానికి తేడా లేకుండా పాలన సాగించారనే కదా..చంద్రబాబుపై వచ్చిన విమర్శ. జన్మభూమి కమటీల పేరుతో టిడిపి నేతల కమిటీలకు గ్రామాలలో పెత్తనం అప్పగించి, పంచాయతీలను నిర్వీర్యం చేశారనే కదా ఆయన పై వచ్చిన ఆరోపణ. జన్మభూమి కమిటీ లు మాఫియా కమిటీలుగా మారి ప్రజలను వేధించాయనే కదా ప్రజల ఆక్రోశం.2014 లో అదికారంలోకి రాగానే జిల్లా కలెక్టర్ల సమావేశంలో టిడిపి వాళ్లకు అన్ని విదాలుగా సహకరించాలని బహిరంగంగానే చెప్పి వివాదం అయ్యారనే కదా..ప్రజల విమర్శ. టిడిపి కార్యకర్తలను చంద్రబాబు పట్టించుకోకపోవడం ఏమిటి? ఎక్కువ గా పట్టించుకుని దెబ్బతిన్నారు. మొత్తం టిడిపి కార్యకర్తల పెత్తనం అయితే తిరుగు ఉండదని అనుకున్నారు.వాళ్లను ఇష్టం వచ్చినట్లు దోచుకోనిస్తే ఆ డబ్బుతో ఓట్లు కొంటారు కనుక,పోల్ మేజనేజ్ మెంట్ తేలికగా అయిపోతుందని కదా చంద్రబాబు అనుకున్నది. కాని టిడిపి కార్యకర్తలనండి,, ఒక శ్రేణి నాయకులు అనండి ..ఇసుక అనండి..భూములు అనండి..పంచాయతీ దందాలనండి..ఇష్టం వచ్చినట్లు జనాన్ని పిండేయడం వల్ల ప్రజలలో వ్యతిరేకత వచ్చింది.కార్యకర్తల కోసం పనిచేయాలని చంద్రబాబును కార్యకర్తలు కోరినా, పార్టీకోసం పనిచేయండని చంద్రబాబు కార్యకర్తలను కోరినా జరిగింది అదే. కాకపోతే అటు చంద్రబాబు కాని, ఇటు టిడిపి కార్యకర్తలు కాని ప్రజలను వదలివేయడమే అసలు తప్పు. ప్రజలంతా తమ చెప్పుల తేళ్ల వలే పడి ఉంటారని అనుకున్నారు కాని, తేళ్ల బయటకు వచ్చి కుడతాయని ఊహించలేకపోయారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా చేయవచ్చనుకుని, పలుచోట్ల కార్యకర్తలు అనుకుంటే , చంద్రబాబు కూడా పోలీసులు తమ కు కార్యకర్తల వంటివారేనని బావించారు. అందువల్ల 2019 ఎన్నికలలో టిడిపికి ఇంత ఘోరమైన ఓటమి సంభవించింది. ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తలను ఏమి అనలేని పరిస్థితి. కార్యకర్తలు చంద్రబాబును అనలేని పరిస్థితి. ఆ సంగతి ఇద్దరికి తెలుసు.ఎక్కడో కొందరు అమాయకులు తప్ప, అవకాశం ఉన్న ప్రతి టిడిపి కార్యకర్త చేయవలసినంత దౌర్జన్యం అనండి. దందా అనండి..మరొకటి అనండి..అన్నీ చేసి చివరికి అంతా కలసి మునిగిపోయారు.ఇప్పుడు పరస్పరం ఓదార్చుకుంటున్నారు.లేదా పరస్పరం నీవల్ల ఓటమి అంటే నీ వల్ల అని వాదించుకుంటున్నారు.అయితే ఒకటి మాత్రం నిజం . చంద్రబాబు ,కార్యకర్తలు ఇద్దరూ మారాలి. చంద్రబాబు తాను ప్రభుత్వంలో ఉండగా చేసిన తప్పుల మీద ఆత్మపరీశీలన చేసుకోవాలి. తనను ఓడించడం ఏమిటని ఆయన ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తే ప్రజలు అమాయకులు కారు. తన విదానాలు, తన ప్రభుత్వ విదానాలు ..ఎక్కడ తప్పులు జరిగాయన్నదానిపై ఆయన సమీక్షించకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నాంకదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే అదే అదికారంలోకి తెస్తుందని భ్రమపడితే ఆయనను ఎవరు రక్షించలేరు.అలాగే కార్యకర్తలు కూడా ప్రజలంతా తమ చెప్పుచేతలలో ఉండాలన్న భావనతో వ్యవహరించకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని అనుకున్నప్పుడు ,అలా ప్రవర్తించినప్పుడు వారు మారుతున్నట్లు లెక్క. కాని ఒక తరహా రాజకీయానికి, ఒక పెత్తందారి విదానానికి అలవాటు పడ్డాక, చంద్రబాబు అయినా, కార్యకర్తలు అయినా మారడం కష్టమే .

(ఇంతకుముందు ప్రచురించిన ఆర్టికిల్ లో టైప్ తప్పులు ఎక్కువగా ఉన్నాయి. అందుకు విచారిస్తున్నాము. వాటిని సరిచేసి తిరిగి ఇస్తున్నాము.)

tags : tdp, workers

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info