A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయోద్య రామాలయం నిర్మాణం ఇక చకచకా
Share |
November 22 2019, 12:06 am

దేశ రాజకీయాలను ప్రబావితం చేసిన రామమందిరం సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. సుప్రింకోర్టు తీర్పుతో ఆయోద్యలో రామ మందిర నర్మాణానికి ఇక ఇబ్బంది ఉండకపోవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.అయోద్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు రామాలయ నిర్మాణానికి కోర్టు అనుమతించింది. అలాగే ముస్లింలకు ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాంయించాలని కూడా సుప్రింకోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివివినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. అయితే తీర్పు పట్ల ముస్పిం సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తీర్పును గౌరవిస్తామని ప్రకటించాయి.‘మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాల’ని తీర్పును చదువుతూ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని తెలిపారు.

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info