A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేదల మనసు తెలిసిన నేత కెసిఆర్
Share |
November 22 2019, 1:12 am

టిఆర్ఎస్ కు బాసులు డిల్లీలో లేరని, తెలంగాణ గల్లీలలోనే ఉన్నారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. పేద ప్రజల గుండెలలో కెసిఆర్ కొలువు తీరారని ,టిఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన దీమా వ్యక్తం చేశారు.. ఎన్ని శాపనార్థాలు, విమర్శలు చేసినా దిష్టి తీసి పోతున్నాయని ఆయన అన్నారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, పేద పిల్లలకు సన్నబియ్యం, ఆశ్రమ పాఠశాలలు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్‌లకు జీతాల పెంపు వంటివి కెసిఆర్ పేదల పక్షపాతి అని రుజువు చేస్తున్నాయని ఆయన అన్నారు. పేదల మనసు తెలుసుకున్న నాయకుడు కాబట్టే కేసీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రి చేశారని అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info