A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యా వ్యవస్థలో మార్పు కోసం పని చేస్తాం : ఆలూరు
Share |
February 22 2020, 7:02 pm

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సిఇఒగా ఆలూరు సాంబశివారెడ్డి బాధ్యతలు చేపట్టారు. కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రెడ్డి కాంతారావు సమక్షంలో ఆయన విధుల్లోకి చేరారు. అలాగే వైస్ చైర్ పర్సన్ విజయ శారదా రెడ్డి కూడా బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విద్యా చరిత్రలో మొదటి సారిగా ఇలాంటి కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా సాంబశివారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా తామంతా పని చేస్తామని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు, మేధావులు విద్యారంగంలో మార్పుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న విషయాన్ని తాము గుర్తుపెట్టుకుంటాం అని సాంబశివారెడ్డి తెలిపారు.

tags : aluru

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info