A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో వాణిజ్య పన్నుల్లో స్వల్పంగా వృద్ది
Share |
November 22 2019, 3:54 am

*శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను సమావేశంలో సీఎంకు వివరించిన అధికారులు*

*అధికారుల ప్రజెంటేషన్‌లో కీలక అంశాలు:* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆద్వర్యంలో జరిగిన సమీక్షలో వివిధ శాఖల ద్వారా వస్తున్న ఆదాయాలను,ఇతర అంశాలను సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయాలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల్లో 0.14శాతం వృద్ధి
– గత ఏడాది అక్టోబరు వరకు వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.24,947 కోట్లు కాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.24,982 కోట్లు
– ఎక్సైజ్‌ శాఖలో 8.91 శాతం తగ్గిన ఆదాయం
– ఎక్సైజ్‌ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.4043.72 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ. 3683.25 కోట్లు
– స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 3.26 శాతం ఆదాయం పెరుగుదల
– స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.2804.67 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అక్టోబరు వరకు రూ. 2895.96 కోట్ల ఆదాయం
– రవాణా శాఖలో 6.83 శాతం తగ్గిన ఆదాయం
– రవాణా శాఖలో గత ఏడాది అక్టోబరు వరకు రూ.2116.49 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరంలో అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1971.91 కోట్లు
– గనులు, భూగర్భ వనరుల శాఖలో గణనీయంగా 19 శాతం తగ్గిన ఆదాయం
– గనులు, భూగర్భ వనరుల శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.1258 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1023 కోట్లు మాత్రమే
– ల్యాండ్‌ రెవెన్యూ శాఖలోనూ తగ్గిన ఆదాయం. గత ఏడాది కంటే 23.49 శాతం తగ్గుదల
– ల్యాండ్‌ రెవెన్యూ శాఖలో గత సంవత్సరం అక్టోబరు వరకు రూ.109.66 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.83.9 కోట్లు
– అటవీ శాఖలో 78.03 శాతం తగ్గిన ఆదాయం
– అటవీ శాఖ ద్వారా గత ఏడాది అక్టోబరు వరకు రూ.131.69 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు వచ్చిన ఆదాయం రూ.29.94 కోట్లు మాత్రమే
– అన్ని శాఖల నుంచి గత ఏడాది అక్టోబరు వరకు మొత్తం రూ.35,411.23 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం అక్టోబరు వరకు 2.10 శాతం తగ్గి వచ్చిన ఆదాయం రూ.34,669.35 కోట్లు
– రవాణా శాఖ ఆదాయంలో మొదటి, రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు వరసగా మైనస్‌ 11.81 శాతం, మైనస్‌ 12.42 శాతం కాగా, అక్టోబరులో వృద్ధి రేటు 15.4 శాతం నమోదైంది.
– అయినప్పటికీ రవాణా శాఖలో మొత్తం మీద ఆదాయం తగ్గి మైనస్‌ 6.83 శాతం వృద్ధి రేటు నమోదైంది

సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి:
– ఆర్థిక వ్యవస్థ మందగమనం (స్లోడౌన్‌)లో ఉన్నప్పటికీ
ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నాం: సీఎం

tags : taxes, income,ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info