A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కంటైనర్ దూసుకు వెళ్లి 12 మంది మృతి
Share |
November 22 2019, 3:13 am

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ వద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పన్నెండు మంది వరకు మరణించారని సమాచారం. ఒక భారీ కంటైనర్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కొన్ని వాహనాలపై దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.చనిపోయినవారిలో ఎనిమిది మంది ఒకే కుటుంబం వారు అని చెబుతున్నారు. వారంతా బంధువుల కుటుంబంలో ఒకరు మరణించడంతో అక్కడకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యువాత పడ్డారు.వీరు మర్రిమాకులపల్లె కు చెందిన రెడ్డి శేఖర్ కుటుంబం వారు అని గుర్తించారు.ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలో మృతిచెందారు.కంటెయినర్ డ్రైవర్ కూడా మరణించాడు. మరికొందరు గాయపడ్డారు.

tags : ap, accident

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info