A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడప స్టీల్ ప్లాంట్ - మరో ముందడుగు పడినట్లేనా
Share |
November 22 2019, 3:18 am

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబందించి ఒక ముందడుగు పడినట్లు కనిపిస్తుంది.కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ ల మంత్రి దర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయిన సందర్భంలో ఈ విషయంపై ఒక అవగాహన కుదిరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం కుదిరిందని, త్వరలో ఎన్‌ఎండీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓయూ చేసుకుంటారని తెలిపారు. కాగా చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల వినియోగం ద్వారా వస్తున్న ఆదాయాల మేరకు సీఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం ప్రాంతంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన రూ.81 కోట్లను త్వరలో చెల్లించడానికి అంగీకరించారు. కాకినాడ–రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు .కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుపై అత్యున్నతస్థాయి కమిటీ, కమిటీలో కేంద్రం, రాష్ట్రానికి చెందిన అధికారులు
వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వంటి ప్రతిపాదనలు కూడా చర్చించారు.

tags : center, steel,kadapa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info