A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల సుద్దులు చెబుతున్నారు
Share |
November 22 2019, 3:19 am

ఎసి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృస్ణుడు విమర్శలు చేశారు. తమ్మినేని ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదని యనమల అన్నారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా తమ్మినేని పక్షపాతంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.స్పీకర్ ఆటలో రిఫరీ లాంటి వారని అన్నారు. సభానాయకుడిని ఏ విధంగా గౌరవిస్తారో, ప్రతిపక్ష నాయకుడిని అంతే సమానంగా గౌరవించాలని ఆయన సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అధికార పక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని ఆయన యనమల సుద్దులు చెప్పారు.

యనమల ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు కాని, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు కాని, కోడెల స్పీకర్ గా ఉన్నప్పుడు కాని ఇలా వ్యవహరించి ఉంటే బాగుండేది కదా..కోడెల అయితే ప్రత్యక్షంగా పార్టీ సమావేశాలలో పాల్గొని ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు చేయడం యనమల మర్చిపోయారా?అయితే స్పీకర్ సాద్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిదే.కాని ఇప్పుడు ఆ పరి్స్తితి లేకుండా చేసింది ఎవరు?

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info