A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిలయన్స్, అదాని పెట్టుబడులపై మంత్రి వివరణ
Share |
November 22 2019, 3:22 am

ఎపిలో రిలయన్స్, ఆదాని గ్రూపు సంస్తల పెట్టుబడుల విషయంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నాన్ని ఎంపిక చేశారని, ఈ ప్రాంతంల్లో పోర్టు నిర్మాణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులకు అదానీ గ్రూపు సిద్ధంగానే ఉందని, దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పెట్టుబుడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు భూములు లేకుండా ఉన్నాయని ఆయన చెప్పారు.అందుకే ఎంత పెట్టుబుడులు పెట్టబోతున్నారో పూర్తి సమగ్ర నివేదిక అడుగుతున్నామని, అందుకు తగిన విధంగా ప్రభుత్వ నుంచి భూకేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రిలయన్స్‌ సంస్థకు కేటాయింపుల్లో సరిగా వ్యవహరించలేదని, అలాగే తిరుపతి వివాదాలున్న భూములను రిలయన్స్‌కు కేటాయించిందని ఆరోపించారు. ఇటీవల తాము ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయని, రిలయన్స్‌తోపాటు ఈ తరహా వివాదాలలో కేటాయించిన సంస్థలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపులపై పరిళీలన చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో, ఔత్సాహికులతో చర్చించి తమ ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీ ప్రకటించబోతున్నామని, ఈ బడ్జెట్‌ సమావేశాలకు కొత్త పాలసీ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

tags : mekapati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info