A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీలో తప్పు..ఒప్పు
Share |
February 22 2020, 5:50 pm

రాజకీయాలు తమాషాగా ఉంటాయి. సడన్ గా ఇష్టం లేనివారు ఇష్టులైపోతారు. అంతవరకు తీవ్ర విమర్శలు చేసినవారికి సడన్ గా అదే మనిషిలో డార్లింగ్ కనిపిస్తారు. ఆంద్రప్రదేశ్ లో ఈ తరహా రాజకీయాలు పుష్కలంగా సాగుతున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల సమయంలో అప్పటి ఛీప్ సెక్రటరీని తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్ వి సుబ్రహ్మణ్యం ను నియమించింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనేక వివాదాస్పద వ్యవహారాలు నడిపిన ఫలితంగాను ఆనాటి ఇంటిలెజెన్స్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావును బదిలీ చేయడానికి వీలు లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం ఆనాటి చీప్ సెక్రటరీని బలి తీసుకుందన్నది వాస్తవం.ఎబి వెంకటేశ్వరరావు పట్ల చంద్రబాబు ఎందుకు అపారమైన ,అవ్యాజమైన ప్రేమ కనబరిచారన్నది బహిరంగ రహస్యమే. పోలీసుల బాద్యతల కన్నా తెలుగుదేశం విజయమే లక్ష్యంగా ,ఏ మాత్రం మోహమాటం లేకుండా వెంకటేశ్వరరావు వ్యవహరించారన్న అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక డిజిపిని ఆర్పి ఠాకూర్ పై ఎంత తీవ్రమైన విమర్శలు వచ్చింది గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా దొరుకుతాయి. అయితే ఎల్వి సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని విమర్శలు చేశారో ఆయన మర్చిపోయి ఉండవచ్చు.తెలుగుదేశం నేతలతో ఎన్ని దూషణలు చేయించింది ఆయన మర్చి పోయి ఉండవచ్చు. అసలు అప్పట్లో ముఖ్యమంత్రి, సి.ఎస్.కలుసుకోవడమే పెద్ద వార్త అయింది. అలాంటి పరిస్థితిలో ఎపి ముఖ్యమంత్రి జగన్ అదికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.ఎన్నికల సంఘం నియమించినా, తాను కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం నే కొనసాగించి ఆయనను గౌరవించారు. ఈ ఐదు నెలలు పెద్దగా ఇబ్బంది లేకుండానే సాగింది. కాని ఈ మధ్య ఏదో తేడా వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగాను, జిఎడిలో పొలిటికల్ సెక్రటరీగాను బాద్యతలు స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు సి.ఎస్ .కు మధ్య అంతరం వచ్చింది. అయితే వీరిద్దరూ సర్దుబాటు చేసుకుని ఉంటే బాగుండేది. అలాగే కొన్ని జిఓల విషయంలో సుబ్రహ్మణ్యం లేటు చేశారని కొందరు చెబుతున్నారు. అలాగే ప్రవీణ్ ప్రకాష్ కు అదికారాలు ఇవ్వడం సుబ్రహ్మణ్యానిని నచ్చలేదని అంటారు.అలాంటప్పుడు ముఖ్యమంత్రి తో స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. అలాకాకుండా ఏకంగా ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు జారీ చేయడం అది మీడియాలో ప్రముఖంగా వచ్చి వివాదంగా మారడం జరిగింది. నాకు తెలిసి గత నలభై ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు. ముఖ్యమంత్రి ఆఫీస్ లోని వారికి నోటీసు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించేదే. అంటే ఒకరకంగా అది సి.ఎమ్.కు నోటీసు ఇచ్చినట్లే అవుతుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం కాకతాళీయంగా చేశారా?లేక కావాలని చేశారో తెలియదు కాని, దీనివల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కర పరిస్తితి సృష్టించారు. ప్రవీణ్ ప్రకాష్ కు మంచిపేరే ఉన్నా కొంత దూకుడుగా ఉంటారన్న భావన కూడా లేకపోలేదు.ఈ వివాదం ముదరడంతో ముఖ్యమంత్రి వీరిలో ఎవరో ఒకరిని వదలుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అనుకోవాలి. సహజంగానే ఆయన ప్రవీణ్ ప్రకాష్ వైపు మొగ్గు చూపారు.దాంతో ఎల్వి బదిలీ అయ్యారు.దానిపై చంద్రబాబు విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే కొన్ని పత్రికలు సచివాలయ వర్గాల పేరుతో దారుణమైన కధనాలు రాయడం మరొక ఎత్తుగా ఉంది. దీని ఆదారంగా ఆంద్ర సమాజంలో మతపరంగా విద్వేషాలు రేకెత్తించాలని ఆ పత్రికలు ప్రయత్నించారు. అన్యమత జిఓ అమలు చేయడానికి ఎల్వి ప్రయత్నించారని అందుకు ఆయనపై వేటు వేశారని దారుణమైన ప్రచారానికి టిడిపి మీడియా ఒడికట్టింది. నిజంగానే దాని అమలు ఇష్టం లేకపోతే జగన్ ఆ జిఓ ఎందుకు ఇచ్చారు?మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి జీఓనే ఇవ్వలేదే? అప్పుడు ఎందుకు హిందూ దేవాలయాలలో అన్యమతస్తులను ఉద్యోగులుగా కొనసాగించింది. అలా కొనసాగించవద్దని జిఓ ఇచ్చిన జగన్ పైన అభాండాలు వేయడానికి టిడిపి మీడియా వెనుకాడలేదు.ఆర్టిసి టిక్కెట్ లపై చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకున్నా అది గొప్ప విషయంగా టిడిపి మీడియా భావించింది. ఇప్పుడు అలాంటి వాటికి వ్యతిరేకంగా జిఓ ఇచ్చిన జగన్ ప్రభుత్వంపై మాత్రం బురద చల్లుతున్నారు. ఎల్వి బదిలీ విషయంలో మిగిలిన ఎన్ని విమర్శలు చేసినా అభ్యంతరం లేదు. తప్పు లేదు.కాని మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది మాత్రం కచ్చితంగా దురుద్దేశంతో కూడిన వ్యవహారంగానే అనిపిస్తుంది.మరి గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఛీప్ సెక్రటరీలను మార్చలేదా?గతంలో ఆనందరావు అనే ఛీప్ సెక్రటరీని మార్చి మరొకరిని ఎందుకు నియమించుకున్నారు? సి ఎస్ నియామకం కాని, మరొకరి పోస్టింగ్ కాని ముఖ్యమంత్రి అభీష్టం ప్రకారం సాగుతాయి. అంతేకాదు.ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే సీనియర్ అదికారులు సి.ఎమ్. డైరెక్షన్ మేరకు పనిచేస్తారు. అందువల్ల సి.ఎస్.అయినా ఎవరైనా సహజంగానే ముఖ్యమంత్రి ఆఫీస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఈ రోజు వచ్చిన విషయం కాదు. దశాబ్దాల తరబడి సాగుతున్న వైనం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీ అదికారులే మొత్తం నడిపేవారని మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు స్వయంగా పేర్కొన్నారు.ఆయన సి.ఎస్.ను మార్చే విధానం బాగోలేదని చెప్పడం తప్పు కాదు. కాని కుట్రపూరితంగా మత కోణం యాడ్ చేయడం మాత్రం అంతటి సీనియర్ అయిన వ్యక్తికి తగదు. గతంలో చంద్రబాబు వద్ద సి.ఎస్.గా పనిచేసినప్పుడు అమరావతి అంశంలో కాని, ఇతర అంశాలలో కాని తనకు నచ్చకపోయినా,తానేమీ చేయలేకపోయానని ఆయనే చెప్పారు. అంటే దాని అర్దం సి.ఎమ్ కు ఉండే పవర్ ను అంగీకరించడమే కదా. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక కృష్ణారావు ఎన్ని విమర్శలు చంద్రబాబు పై చేసింది రహస్యం కాదు.ఇక తెలుగుదేశం నేతలు అయితే ఒక్కసారిగా ఎల్వి సుబ్రహ్మణ్యంపై ఎక్కడ లేని ప్రేమ కురిపించారు.అదంతా ఆయనపై ఉన్న అబిమానం కాదు.వైసిపిపై ఉన్న ద్వేషం అన్న సంగతి తెలిసిందే.అందుకే రాజకీయాలలో ఎప్పుడు ఎవరిపై ప్రేమ వస్తుందో చెప్పలేం అనడానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది.జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి తాను సి.ఎస్.ను మార్చినప్పుడు పోలీసు అదికారులను తన ఇంటి మనుషుల మాదిరి వాడుకున్నప్పుడు మాత్రం వ్యవస్థలు బాగా పనిచేశాయన్నమాట . చంద్రబాబు వద్ద పనిచేసి బయటకు వచ్చిన అనేక మంది అధికారులు ఆయనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో ఆయన సమాధానం చెబితే అప్పుడు ఏమైనా మాట్లాడవచ్చు.ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు అనివార్యం కావచ్చు.కాని పరిపాలన యంత్రాంగంపై వీటి ప్రభావం పడకుండా చూసుకోవల్సిన అవసరం ప్రబుత్వంపై ఉంటుంది.లేకుంటే ప్రత్యర్ది రాజకీయ పక్షాలకు విమర్శించే అవకాశం చేతులారా ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించక తప్పదు.

tags : lv

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info