A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనకు మరో నలుగురు పిఎసి సభ్యులు
Share |
May 27 2020, 7:09 am

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో మరో నలుగురు నాయకులకు అవకాశం
కల్పిస్తూ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. శ్రీ నాదెండ్ల
మనోహర్ గారు ఛైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో ఇప్పటి వరకూ 12 మంది సభ్యులు ఉన్నారు.
కమిటీని విస్తరిస్తూ కొత్తవారికి స్థానం కల్పించడంతో ఆ సంఖ్య 16కి చేరింది. ఈ
మేరకు బుధవారం కొత్త సభ్యులకు కమిటీలోకి ఆహ్వానం పలుకుతూ ట్విట్టర్ ద్వారా
వివరాలు వెల్లడించారు. శ్రీ పంతం నానాజీ (కాకినాడ), శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
(ధర్మవరం), శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ (గుంటూరు), శ్రీ పితాని బాలకృష్ణ
(ముమ్మిడివరం)లకు పి.ఎ.సి. సభ్యులుగా అవకాశం ఇచ్చారు.
జనసేన అధికార ప్రతినిధులుగా ముగ్గురుకి అవకాశం ఇచ్చారు. శ్రీమతి సుజాత పండా
(శ్రీకాకుళం), శ్రీ సుందరపు విజయకుమార్ (విశాఖపట్నం), శ్రీ పరుచూరి భాస్కరరావు
(విశాఖపట్నం)లను అధికార ప్రతినిధులుగా నియమించారు.

tags : janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info