A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బండి సంజయ్ పై దాడి కేసు- స్పీకర్ కు ఫిర్యాదు
Share |
November 22 2019, 12:08 am

కరీంనగర్ బిజెపి ఎమ్.పి బండి సంజయ్ తనపై పోలీసు అదికారి దాడి చేశారని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆర్టిసి ఉద్యోగి శవయాత్ర సందర్భంలో గొడవ అవడం ఒక డిఎస్పి దురుసుగా వ్యవహరించారన్న అబియోగం వచ్చిన సంగతి తెలిసిందే.దీనిపై ఇప్పటికే ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేయగా, కమిషన్ దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. వివరణ ఇవ్వాలని కోరింది. కాగా తాజాగా స్పీకర్ ను కలిసి కలెక్టర్ పై ప్రివిలేజ్ పిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా స్పీకర్ ప్రివిలేజ్ కమటీ చైర్మన్ ను ఆదేశించారు.

tags : bandi sanjay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info