A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.సర్కార్ కు హైకోర్టు మరోసారి అక్షింతలు
Share |
July 10 2020, 12:09 am

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు అక్షింతలు పడ్డాయి. ఒక వైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్టిసికి 49 కోట్ల రూపాయలు ఇవ్వలేదా అని మరోసారి హైకోర్టుప్రశ్నించింది. అసలు ప్రభుత్వానికి ఆర్టిసి సమస్యను పరిష్కరించే ఆలోచన ఉందా?లేదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని మానవత్వ కోణంలో కూడా చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.హైకోర్టుకు నివేదిక సమర్పించిన తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు.నివేదిక పేరుతో అబద్దాలు రాస్తారా?తన అనుభవంలో ఇంత అబద్దాల నివేదికను చూడలేదని న్యాయమూర్తి పేర్కొనడం విశేషం.ఆర్టిసి విభజన అంశం కేంద్రం పరిదిలో ఉన్నప్పుడు టిఎస్ ఆర్టిసిని ఎలా ఏర్పాటు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.విచారణను ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసింది.

tags : highcourt, t .sarkar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info