A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు
Share |
November 22 2019, 1:12 am

ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అదే పనిలో పడ్డారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ బాదితులు అంటూ ,కేసులు పెడుతున్నారంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అది తప్ప మరొకటి మాట్లాడడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన మీటింగ్ లో పలు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే తమ అక్రమాలకు అడ్డు ఉండదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతూ ప్రజల్ని పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులను ఆయన హెచ్చరించారు.వైసిపి తప్పులు బయటపడకుండా చూస్తున్నారని కూడా ఆయన అన్నారు.

tags : chandrababu, police

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info