A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాట నిలబెట్టుకున్నా-జగన్
Share |
November 22 2019, 12:11 am

పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ బాదితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నేను విన్నాను..నేను ఉన్నాను ..అని ఆనాడు చెప్పానని, ఇప్పుడు దానిని నిలబెట్టుకుంటున్నానని ఆయన అన్నారు.3.6 లక్షల మందినిరుపేద కుటుంబాలకు ఇప్పుడు తోడుగా ఉండడానికి, వారి కష్టాలు కొంత అయినా తీర్చాలనే డబ్బు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 20 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసినవారికి కూడా త్వరలోనే డబ్బు ఇస్తామని ఆయన అన్నారు.ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నా, ఒక్కో ముడి విప్పుకుంటూ కోర్టు నుంచి అనుమతి తీసుకుని డబ్బు ఇస్తున్నామని ఆయన చెప్పారు.ఇప్పుడు 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు.మిగిలినవారికి కోర్టు అనుమతి తీసుకుని చెల్లిస్తామని జగన్ తెలిపారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info