A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐఎఎఎస్ అదికారులకు హైకోర్టు ప్రశ్నలు
Share |
May 27 2020, 8:03 am

ఆర్టిసి సమ్మె విషయంలో ప్రభుత్వం, అదికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి అసంతృఫ్తి వ్యక్తం చేసినట్లు కనబడుతోంది.హైకోర్టు ఆదేశాల మేరకు ఛీప్ సెక్రటరీ ఎస్.కె. జోషి, ఆర్టిసి ఎమ్.డి సునీల్ శర్మలు కోర్టుకు హాజరయ్యారు.ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలుసా? అని కోర్టు ప్రశ్నించింది. ఓ ఐఏఎస్ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అసహనం వ్యక్తం చేసింది. రికార్డులు పూర్తిగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్లు నివేదికలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తెలియచేశారంటే, మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సమాచారం వచ్చింది.

tags : highcourt, ias

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info