A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పడవ ప్రమాదాలు- జగన్ ఆదేశాలు
Share |
November 22 2019, 1:13 am

బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*

*జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం*
*బోటు ప్రమాద ఘటన, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎంకు వివరించిన అధికారులు*

*బోటు ప్రమాదాల నివారణ, భద్రతకోసం 8 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుకు సీఎం నిర్ణయం*
*ఎమ్మార్వో ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్స్‌*
కంట్రోల్‌ రూంలో జలవనరులశాఖ, పోలీసులు, టూరిజం తదితర విభాగాలనుంచి సిబ్బంది
ప్రతి కంట్రోల్‌ రూంలో కనీసం 13 మంది సిబ్బంది
ప్రతి కంట్రోల్‌ రూంలో ముగ్గురు పోలీస్‌కానిస్టేబుళ్లు తప్పనిసరి: సీఎం
నవంబర్‌ 21న 8 కంట్రోల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన
90 రోజుల్లో అందుబాటులోకి కంట్రోల్‌ రూమ్స్‌

బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, వాటి కదిలకపై నిరంతర సమాచారం, వరద ప్రవాహాలపై సమాచారం వీటన్నింటినీ కంట్రోల్‌ రూమ్స్‌ పరిగణలోకి తీసుకుని ఆమేరకు బోట్ల నిర్వహణను పర్యవేక్షించాలి: సీఎం
బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్‌ వినియోగం ఉండకూడదు: సీఎం
అలాగే సిబ్బందికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలి: సీఎం
బోట్లకు జీపీఎస్‌ కూడా పెట్టాలి: సీఎం
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్‌ రూమ్స్‌ను తీర్చిదిద్దాలి:
కంట్రోల్‌ రూమ్స్‌పరిధిలో బోట్లు, జెట్టీలు ఉండాలి:
*బోట్లపై ప్రయాణించేవారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్‌ రూమ్స్‌కే ఇవ్వాలి: సీఎం*

బోటులో ప్రయాణించుటకు టిక్కెట్లు టూరిజం శాఖకి /సంబంధించిన అధికారులనుంచి నుంచి తీసుకోవాలని నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రిగారికి సూచించారు.
కంట్రోల్‌ రూమ్‌కు ఎమ్మార్వోనే ఇన్‌ఛార్జి: సీఎం
ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా కంట్రోల్‌ రూం చూడగలిగితే.. గ్రేడింగ్‌ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలి:సీఎం
బోట్లలో వాకీటాకీలు, జీపీఎస్‌లు తప్పనిసరిగా ఉండాలి: సీఎం

మరోసారి బోట్లన్నీ తనిఖీచేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలి: సీఎం
ఆపరేటింగ్‌ స్టాండర్ట్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ఉండాలి: సీఎం
నదిలో ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి:
కంట్రోల్‌రూంలో ఉండే సిబ్బంది నదిలో ప్రయాణాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి:
కంట్రోల్‌ రూమ్స్‌లో సిబ్బందిని రిక్రూట్‌ చేశాఖ వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వండి:
కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంచాల్సిన సిబ్బందిని త్వరగా రిక్రూట్‌ చేయాలి:
ప్రస్తుతం లైసెన్స్‌లు, బోట్లను తనిఖీ చేస్తున్నామన్న అధికారులు
బోట్లలో పనిచేసేవారికి శిక్షణ కూడా ఇవ్వాలి, శిక్షణ ఉన్నవారికే పనిచేయడానికి అనుమతి:సీఎం
క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి: సీఎం
తనిఖీలు చేసిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇస్తామన్న అధికారులు
దీనికోసం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామన్న అధికారులు.

tags : ap,boats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info