A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ మార్చ్- ఒక విశ్లేషణ
Share |
May 25 2020, 8:41 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం మీద ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ పేరుతో షార్ట్ మార్చ్ పూర్తి చేశారు.రెండు ,మూడు కిలోమీటర్ల దూంంలోఈ మార్చ్ నిర్వహించి, మద్యలో కొంతదూరం అయన కారుపై ఎక్కి అబిమానులకు అభివాదం చేసుకుంటూ సాగారు. ఆ తర్వాత తెలుగుదేశం , ఇతర పక్షాల నేతలతో కలిసి ప్రసంగం చేశారు.ఆయన ఇసుక సమస్య గురించి ప్రస్తావించడం తప్పు కాదు.నిరసన చెప్పడం ఆక్షేపణీయం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అవకాశం దొరికినా వాడుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఇసుకకే పరిమితం కాకుండా లపు రాజకీయ విమర్శలు చేశారు. అదికూడా తప్పు కాదు. ఆయన విమర్శలు కాకుండా ద్వేషభావంతో మాట్లాడినట్లుగా ఉంది. తన ఓటమిని జీర్ణించుకోలేని రీతిలో ఆయన ఉపన్యాసం చేశారు.ఇది ఆయన సొంతంగా చేసి ఉంటే ఒక క్రెడిట్ వచ్చేది. కాని ఆయన దానిని వదలుకున్నారు.బహుశా భయపడి ఉండాలి.టిడిపి అండ లేకుండా సభ నిర్వహిస్తే ఆశించిన మేర జనం రాకపోతే పార్టీకి మరింత ఇబ్బంది అవుతుందని ఆయన అనుకుని ఉండవచ్చు.దాంతో ఆయన టిడిపి నేతలను కూడా ఆహ్వానించారు.ఈ అదను కోసమే ఎదురు చూస్తున్న చంద్రబాబు వెంటనే ముగ్గురు నేతలను పవన్ సభకు వెళ్లాలని ఆదేశించారు. కాని గంటా శ్రీనివాసరావు ఎందువల్లో వెళ్లలేదు.అచ్చెన్నాయుడు , అయ్యన్నపాత్రుడు వెళ్లి జనసేన వేదికపై టిడిపి స్పీచ్ ఇచ్చారు.విశేషం ఏమిటంటే వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇసుక దోపిబీ జరిగిందని ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కువసార్లు కాకపోయినా,ఒకటి,రెండుసార్లు ప్రస్తావించారు.ఉత్తరాంధ్రలో ఇసుక మాఫియా మొత్తం అచ్చెన్నాయుడు కనుసన్నలలో నడిచిందని వైసిపి ఆరోపణలు చేసిది. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని సభ నిర్వహించడం, తనసొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అతి స్వల్ప సమయం కేటాయించి, టిడిపి నేతలకు మాత్రం వారికి తోచినంత సేపు మాట్లాడే అవకాశం ఇవ్వడం కూడా గమనించదగినదే అయింది.భవిష్యత్తులో తెలుగుదేశంతో కలిసి రాజకీయాలు చేస్తారో, లేదో తెలియదు. ఇప్పుడైతే వారిద్దరు కలిసి మళ్లీ పనిచేయడానికి ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మరో వైపు బిజెపి తో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్నారు. చివరికి ఆర్ఎస్ఎస్ అదినేత మోహన్ భగవత్ ను కూడా ఆశ్రయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే మళ్లీ బిజెపి,జనసేన లను పక్కన పెట్టుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారని అర్దం అవుతుంది.అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బిజెపి పట్ల సానుకూలంగా మాట్లాడడం కనిపించింది.ప్రదాని మోడీ తో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పడానికి యత్నించారు.వైసిపి నేత విజయసాయిరెడ్డి డిల్లీలో బిజెపి నేతలతో సత్సంబధాలు నడుపుతున్నారని ఆయన బాదపడడం స్పష్టంగా కనిపంచింది.ఆ చాన్స్ కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారేమో తెలియదు.ఆ సంగతి ఎలా ఉన్నా, జనసేన నేతలు గతంలో టిడిపి పై చేసిన విమర్శలుఅవినీతి ,ఆరోపణలు అన్నిటిని మర్చిపోవాలని పవన్ కళ్యాణ్ సంకేతం ఇచ్చారు. అంతేకాక చంద్రబాబు అనధికార కట్టడానికి ,తన స్నేహితుడు లింగమనేని రమేష్ కు మద్దతు ఇవ్వడానికి ఆయన తాపత్రయపడ్డారన్నది కూడా అర్ధం అవుతుంది.విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని,కులం ఏమిటీ ధూ అంటూ కూడా పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పారు.కోర్టు మెట్లు ఎక్కడమే తప్పు అయితే.నేరమే అయితే పవన్ కళ్యాణ్ ఏ ఏ సందర్భాలలో కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది, అవన్ని విలువకోసమో ,మరింకెందుకో ఆయన చెప్పగలిగితే బాగుంటుంది. ఎదుటివారిని విమర్శించడం తేలకే. కాని తాము ఏమి చేస్తున్నామన్నది ఆత్మపరిశీలన చేసుకోవడమే నేతలకు అంత ఇష్టం ఉండదనుకోవాలి.అంతేకాదు. ఆయన పార్టీలో ఉన్న ఒకరిద్దరు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులపై ఉన్న ఆరోపణల గురించి తెలియదా? లేక తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? ఆయన పార్టీలో ఎక్కువ మంది ఏ వర్గానికి చెందినవారు ఉన్నది,కీలకమైన పోస్టులలో ఏఏ నాయకులు ఉన్నారో ఎన్నికలకు ముందు ఆయా పత్రికలలో వివరంగానే వచ్చింది.తామ అవకాశం ఇస్తే రాజకీయాలలోకి వచ్చి పదవులలోకి వెళ్లారని మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉంటాయి. వ్యక్తిగత గౌరవాలు వేరు. రాజకీయాలు వేరు అన్న సంగతిని ఆయన మర్చిపోయినట్లు ఉంది. రాజకీయాలలో జూనియర్ ,సీనియర్ అని పెద్దగా ఉండవు. ఎవరు రాజకీయంగా పైకి వెళితే వారే సీనియర్ కింద లెక్క అన్నది ఒక ధీరీ.ఒకప్పుడు పార్టీ ఆపీష్ లో ఆపీస్ బాయ్ గా పనిచేసిన జాఫర్ షరీప్ అన్న నేత ఆ తర్వాత కాలంలో కేంద్ర మంత్రి కూడా అయ్యారని చెబుతారు.అంతమాత్రాన ఆయనకు విలువ ఉండదా?నిజానికి ఆయన విలువ పెరిగినట్లు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ కు వైసిపి నేతలు కూడా ఘాటుగానే సమాదానం ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీని టిడిపి ని కోవర్టుల ద్వారా నాశనం చేసిందని, ఇప్పుడు జనసేనను వాడుకుని అదే పనిచేస్తోందని అన్నారు.అందులో ఎంత విశ్లేషణ ఉందన్నది తెలియదు కాని , రాజకీయాలలో ముందుగా సొంతంగా ఎదగడానికి ప్రయత్నించారు.ఆ తర్వాత అవసరమైనప్పుడు ఇతర పార్టీలను కూడగట్టుకోవాలి. ముందుగా తన బలాన్ని రుజువు చేసుకోగలిగితేనే ఎవరైనా విలువ ఇస్తారు.లేకుంటే వాడుకుని వదలివేస్తారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో అర్ధం అయి ఉండాలి.కాని ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగానే ఆయనకు విషయాలపై అవగాహన కన్నా, ముఖ్యమంత్రి జగన్ పైన ,ఆయన ప్రభుత్వంపై ఎక్కువ ద్వేషంతో పనిచేస్తన్నట్లుగా కనిపిస్తుంది.అలా చేస్తే రాజకీయంగా ఆయనకు పెద్దగా కలిసి వచ్చేది కాదు. ఎదుటి వారి బలహీనతలను వాడుకోవడం తప్పు కాదు. కాని ఆ బలహీనతలపైనే ఆదారపడి రాజకీయాలు చేయాలనుకుంటే అది అంతగా లాభించదని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయి. ఒకసారి టిడిపికి, చంద్రబాబుకు అదికారంలోకి రావడానికి ఉపయోగపడ్డ పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో కరివేపాకు మాదిరి అయిపోయారు. ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవడం మంచిదే. కాని ఓటమితోనే పాతికేళ్లపాటు రాజకీయాలు చేస్తానంటే ఆయన తో ఉండేవారికి కూడా అంత ఓపిక ఉండాలి కదా..పవన్ కళ్యాణ్ రాజకీయం ఒక రకంగా అమాయకంగా ,మరో రకంగా ద్వేషపూరితంగా పాగడం వల్ల ఉపయోగం ఉంటుందా?ఉండదా అన్నది కాలమే తేల్చుతుంది.

tags : pawankalyan

Latest News
*తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఎపిలో వ్యవసాయ సలహా మండళ్ల జిఓ
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info