A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒడిసాలో పౌరులకు సోషల్ రిజిస్ట్రి
Share |
November 22 2019, 1:15 am

ఒడిషాలో నివసించే పౌరుల సోషల్ రిజిస్ట్రిని నిర్వహించాలని ఒడిసా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనర్హులు ప్రభుత్వ పదకాల ప్రయోజనాలు పొందకుండా ఉంటారని బావిస్తున్నారు. ఇటీవల రైతులకు భరోసా స్కీమ్ కింద ఇచ్చిన డబ్బులో 170 కోట్ల మేర అక్రమార్కుల జేబులలోకి వెళ్లాయని గుర్తించారు. దీనికి కారణం అర్హులైన లబ్దిదారులు ఎవరన్నదానిపై సరైన రిజిస్టర్ లేకపోవడమేనని ప్రభుత్వం భావించింది. అందువల్ల అన్ని సంక్షేమ పదకాలకు ఒకే రిజిస్టర్ ను ఏర్పాటు చేయడం ద్వారా నిజంగా అవసరమైన అబ్దిదారులను గుర్తించడం తేలిక అవుతుందని, అన్ని పదకాలు ఒకే కుటుంబానికి వెళ్లకుండా ఉంటాయని భావిస్తున్నారు.దీనివల్ల నిదుల దుర్వినియోగం, అవినీతి అదుపులోకి వస్తుందని బావిస్తున్నారు.అయితే సోసల్ రిజిస్ట్రి ఏర్పాటుపై ప్రజాబిప్రాయ సేకరణ చేయనున్నారు.

tags : odisha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info