A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చాట్ ఉత్సవం- 30 మంది మృతి
Share |
November 22 2019, 12:14 am

పండగలు జరగడం ఏమో కాని, పలువరు ప్రాణాలు కోల్పోవడం బాదాకరంగా ఉంది. బీహారు లో చాట్ ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆనందమయంగా ఉండవలసిన ఈ ఉత్సవాలలో గత వారం రోజులలో ముప్పై మంది వివిధ ప్రమాదాలలో మరణించడం విషాదంగా మారింది. గుడి గోడ కూలి ఇద్దరు మహిళలు చనిపోతే,ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో మృతి చెందారు. మిగిలిన ఇరవైఆరు మంది నదులలో ఆయా చోట్ల ప్రమాదవశాత్తు మునిగి చనిపోయి ఆయా కుటుంబాలకు గుండె కోత మిగిల్చారు.సూర్యభగవానుడిని చూడడం కోసం వెళ్లినప్ఉడు తొక్కిసలాట జరిగింది.జనం అంత మంది ఊహించలేకపోయిన స్థానిక యంత్రాంగం తగు ఏర్పాట్లు చేయలేకపోవడంతో తొక్కిసలాట ఏర్పడి ఇద్దరు మరణించగా,మరికొందరు గాయపడ్డారు. ఇక నదులలో స్నానాలకు వెళ్లి మరణించినవారితో పదహారు మంది పిల్లలు ఉండడం బాధాకరం. ఉత్సవాలు ఆనందంగా బతకడానికి గాను, విషాదంతో ముగించడానికి కాకూడదు.

tags : bihar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info