A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని పేరుతో 9 వేల కోట్లు వృధా చేశారు
Share |
November 22 2019, 1:17 am

దేశ చిత్ర పటంలో అమరావతి లేకపోవడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ సిటీ అమరావతి అంటూ గ్రాఫిక్స్‌ ఫొటోలు చూపించారు, మన రాష్ట్రంలో చంద్రబాబు చూపించిన ఫొటోలు, బిల్డింగ్‌లు ఎక్కడైనా ఉన్నాయా?. సింగపూర్‌ ఫోటోలో చూపించి ఇదే అమరావతి అన్నారు. కృష్ణానదిపై ఐకాన్‌ బ్రిడ్జి అన్నారు. ఎక్కడైనా కనిపించిందా?. తెలియని వాళ్లు ఈ ఫోటోలు చూసి అమరావతి అద్భుతంగా ఉందనే భ్రమలు కల్పించారు. ఊహా చిత్రాలు, గ్రాఫిక్స్‌తో బాబు కాలయాపన చేశారు. దేశంలో దొరికిన చోటల్లా అమరావతి పేరుతో చంద్రబాబు అప్పులు చేశారు. రాజధాని పేరుతో రూ.9 వేల కోట్లు చంద్రబాబు వృథా చేశారు. ప్రజలను ఊహా ప్రపంచంలో తిప్పి సర్వనాశనం చేశారు. స్క్వేర్‌ ఫీట్‌కు రూ.12 వేలు వెచ్చించి తాత్కాలిక సచివాలయం నిర్మించారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, అమరావతిని నిర్మిస్తున్నామని గొప్పులు చేప్పి చంద్రబాబు సాధించింది ఏంటి?. అని ఆయన ప్రశ్నించారు.

tags : ambati , capital

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info