A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది దొంగ దీక్ష
Share |
November 22 2019, 12:15 am

ప్రభుత్వానికి మంచి పేరు రాకుండ చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై కోర్ కమిటీ ఎమ్మెల్యేలు సమావేశం అయి చర్చిస్తారని ఆయన చెప్పారు. కాగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ
వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తున్న రోజే ఈనాడు పత్రికలో ఇసుక కొరత, నిర్మాణ రంగంపై కథనం వచ్చిందని, దాన్ని అనుసరించే ఇసుక అవినీతిని అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు ఇసుకపై చేసే దీక్షకు విలువ ఉండదని, ఇసుక విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉందని స్పష్టం చేశారు.మరో ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఇసుక కోసం చేసే దొంగ దీక్షలను ప్రజలు హర్షించరని అన్నారు.. విశాఖలో పవన్‌ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని అని, కొందరు పిచ్చి వాళ్లను పిలిచి చేతులు ఊపితే సరిపోదని ఆయన ఎద్దేవ చేశారు.

tags : ysr congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info