A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
Share |
May 31 2020, 5:12 am

ఆర్టిసి సమ్మెపై కేంద్రానికి గవర్నర్ తమిళ ఈసై నివేదిక ఇచ్చారని వార్తలు వచ్చాయి. డిల్లీలో ఆమె ప్రదాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఈ నివేదిక ఇచ్చారని అంటున్నారు.తొలిసారి వారితో భేటీ మర్యాదపూర్వకమా?లేక కేంద్రం కోరితే నివేదిక ఇచ్చారా అన్నది తెలియవలసి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం, సమ్మెపై ప్రభుత్వ, ప్రజా, రాజకీయ వర్గాల వైఖరి, ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు సహా పలు అంశాలపై ప్రధానికి నివేదించినట్లు సమాచారం. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఆయన నివాసంలో కలసిన గవర్నర్‌.. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయనకు వివరించారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్లాస్టిక్‌పై నిషేధం, యోగా తరగతులు, రెడ్‌ క్రాస్‌ సొసైటీతో కలసి రక్తదాన శిబిరాల ఏర్పాటు వివరాలు కూడా గవర్నర్‌ తెలిపినట్లు రాజ్‌భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

tags : tamil eesai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info